Saturday, January 15, 2011

నీ హ్రుదయం ... నా ప్రాణం

నాతోనే, నాలోనే, పదిలంగా వుంది నా హ్రుదయం లో... 
నీ హ్రుదయం ... నా ప్రాణం, అది లేని నేను లేను
ఎక్కడ వున్నా, ఏమైనా నీవూ నాతోనే, నా ప్రాణమా ...
ప్రతి క్రియా నీ ప్రేరణే, ప్రియతమా ...
జాతకాలు భూటకాలే, నా నమ్మకం, భవిష్యం మాత్రం ... నీవే ప్రియా!
ఈ ప్రపంచంతో నాకు పని లేదు ... నా అందమైన ప్రపంచానివి
... నీవు ...
వెన్నెల వికశించే చద్రబింబానివి!
ప్రతి ఉదయపు అరుణ చైతన్యానివి ... వెలుగు కాంతి పుంజానివి!!!
ఎవరికీ అంతుబట్టని రహశ్యం వుంది చెప్పనా!
... ప్రియా ...
వేరులో వేరునై, మొగ్గ లో చిరుమొగ్గనై, కొమ్మలో కొమ్మనై ఆకాశమంత ఎదిగిన హ్రుదయ సామ్రాజ్యానికి రాజును ... నెలరాజును నేను ...
ఆత్మకూ, ఆలొచనలకూ, వుహకూ అందనంత ఎత్తులో మనసు దాయలేని నిజం ... అది ...
నక్షత్రాలతో ఆడుకోగలుగుతున్న అద్భ్తతమైన ఆకాశ క్రీడ ... స్వర్గం వాకిట్లో నేను ... ఐనా ...
నీ హ్రుదయం నాతోనే వుంది ... నా హ్రుదయం లో భద్రంగా ...

Friday, January 14, 2011

నగ్న సత్యం ...

అందం, ఆకర్షణ కలకలిసి ...
కవ్వించే అయస్కాంతం ... ప్రేమ!

అప్పుడే కలిపి, వెంటనే విడదీసే లక్షణమే ... ప్రేమ?

ఒకవైపే లాగుతూ ... వొకరినే చూడాలనుకునే ...
మనసు పెనుగులాటకు ... కారణం ప్రేమ?

అనుమానం పిశాచి నిలదీస్తే సమాదానం లేని ...
నిజంగా అది ప్రేమేనా, లేక అనుకోవడంవల్లే అది ప్రేమా అని?

కలిసి ఉన్నారు, కలలు కన్నారు ... జీవిస్తున్నారు కనుక ప్రేమిస్తున్నట్లా ...
లేక ప్రేమ అనే అందమైన బావనను ప్రేమిస్తున్నట్లా?

ప్రేమాన్వేషణలో ... ప్రేమను అర్దం చేసుకునే దిశలో ...
పడుతూ లేస్తూ పరుగెట్టే మనిషి జీవితం లో ...

ఒకే ఒక్క నగ్న సత్యం ...

భగ భగమనే నిప్పుకణికల్లో కాలిన హ్రుదయమే వెలుగులు వెదజల్లుతుందనేది ......
ఆ వెలుగుల కాంతిలో ప్రతిదీ ప్రేమ లా కనిపిస్తుందనేది ......

Wednesday, January 12, 2011

ప్రేమే ప్రియ నేస్తం ...

కొండ త్రాచులా మెలికలు తిరుగుతూ, నది ...
ఒడ్డున, ఆలోచనల అలలు హొరులో ...
ప్రయత్నించినా, మరిచిపోలేని కాదన్న ప్రేమ ...

అవహేళన చేస్తున్న ... బ్రతుకు మరీ బారమైనా, మోస్తున్న భావన
వాగులో దూకితే ... చన్నీళ్ళు ... చల్లగా, నీటిని రాయిలామార్చే
కరుడుగట్టిన చలి ... నీటిలో మునగడం కష్టం ...
ఆ నీరు గాని అంత చల్లగా లేకపోతే, భగ్న ప్రేమను భరించేకన్నా ... సంతోషంగా మరణించొచ్చు!

కానీ చలి కొండచిలువ ... నదిలో ...
ఒళ్ళంతా మెలేసి నలిపేస్తుంది ... అబ్బో! భరించలేని చలి ...

LIFT ... ఇరవై అంతస్తుల ఆశల సౌదం, ఆకాశసౌదం ... అది
భగ్న ప్రేమను భరించేకన్నా ... ఆనందంగా, అక్కడ్నించి దూకెయ్యొచ్చు
ఆకాశసౌదం లాంటి అంచుమీద నిలబడి అందర్నీ తిట్టి, ఎంతగానో ఏడ్చి, పెద్దగా అరిస్తే ... వూరట
... తొంగి చూస్తే ... కళ్ళు తిరిగే అంత ఎత్తు ...

అంత ఎత్తుగా వుండివుండకపోతే ... చచ్చి పొవొచ్చు
కానీ .... ఎలా! ... కళ్ళు తిరిగే అంత ఎత్తునుంచి వచ్చే చావును పలుకరించడమే!
అశక్తత ...

బ్రతక్క తప్పదు! ప్రేమలేమికోసం చావాలనివున్నా ... చావలేని స్థితి ...
బహుశ, జీవితం బ్రతకడానికే నేమో అనిపిస్తూ ఆహ్వానించినట్లు ... మొదటిసారిగా ...

... అరుపులు, రోధనలు ప్రతిరోజూ వినేవుంటావు ప్రియతమా ...
ఇంకా మరణించాలని చూస్తే ...మరీ మొండిమనిషి, పెంకిఘఠం అనుకునే అవకాశం ...
దృష్టి లోపాన్ని దిద్దుకునే మధ్యతరగతి మనిషి మనసుకు ...
ప్రేమే ప్రియ నేస్తం ...

నిజానికి జీవితం ... అందంగా, ఆనందంగా స్వచ్చంగా వుంటూ ...
బ్రతుకు పోరాటంలో మనిషికి మనిషి హస్తం ...
ప్రేమ హస్తమే కానక్కరలేదు స్నేహ హస్తమైనా చాలు ...!!

Friday, January 7, 2011

మేలుకొలుపు

ప్రతి ఉదయం కళ్ళు తెరుస్తూనే ...
తనకు తాను, మనిషి చెప్పుకునే మేలుకొలుపు మాట కర్తవ్యం! ...
అవసరం, అవకాశం, ఘటన ... అన్నీ నిమిత్త మాత్రం ...
క్రియల పర్యవసానం ప్రతిక్రియ ...
సంతోషానికి, బాధకు మూలం! ఎప్పుడో వెళ్ళిపొయిన ... గతం ...
...ఇంకా రాని, వుందో లేదో తెలియని ... రేపు.
కళ్ళ ముందున్నది మాత్రం ప్రస్తుతం ... వాస్తవం ...
సంతోషమా ఇదే నీకు నా స్వాగతం! శుస్వాగతం!!

గెలుపు వోటమి

అవకాశం ... ఆసరా తో సాగే ... పూల పాదు
ఈ... జీవితం ...
పాకే పందిరి గెలుపు ...
పడడం ... పడిలేచి పరుగెడడం ... మనిషి బాల్యం ...
వోటమిని పందిరి పునాధిగా మార్చుకో ...
...పునాధి సమాధి కాదనేది జగమెరిగిన సత్యం ...