Sunday, July 26, 2015

నిరర్ధక రహదారుల్లో .... నేను



నేను నడుస్తాను.
ఒక ఖాళీ విగ్రహం లా
నాకు తెలుసు .... స్వేధానికి బదులు
నా అడుగు అడుగు లోనూ
రక్తం చిందిన గుర్తులే 
వదులుతానని

నేను మాట్లాడుతాను.
ఒక నిశ్శబ్ద పదార్ధం లా
నాకు తెలుసు .... ఉద్యమ భావాల బదులు
నిడివైన పోగొట్టుకున్న
నీతిమాలి జారిపోయిన
ఆలోచనలనేనని 


నేను పదాలు అల్లుతాను.
అతి చిన్న జ్ఞాపకాల అనుస్మరణలని
నాకు తెలుసు ..... సంఘటితత్వ పోరాటం బదులు
నిరర్థకము, మూర్ఖపు తలవాకిళ్ళవని
చదవడం అర్ధం చేసుకోవడం
ఎంతో క్లిష్టమని

అది నువ్వే అని


వెనుదిరిగి ఆలోచిస్తుంటాను.
అందరిలా నేనూ ....
జారవిడుచుకున్న కాలాన్నీ కలల్నీ
ఆశ్చర్యం తో పాటు ఆనందం గా ఉంటుంది
నా అదృష్టాన్ని తలచి చూసుకుని
నీవు భాగస్వామివయ్యుండటం
నేను వెనుదిరిగిన ప్రతిసారీ
ఒక వింత భరోసానిస్తూ
ఎదురుగా నవ్వుతూ .... నీ మోము
నా కోసమే అన్నట్లు ఉండటం


నా కలల్లో నీ రూపమే ఎప్పుడూ
ఎంతో ప్రకాశవంతంగా,
తీక్షణంగా, ఆకాశం రాణిలా
నా హృదయాకాశం లో నీ రూపం
ఎన్నో జీవితాల కాలాలపాటు లా
నీకోసమే అలంకరించిన ప్రదేశం లో
దేవతా స్థానం లో
నా ప్రతి ప్రశ్నకూ అర్ధం, సమాధానం లా
నేనెక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా
నీ దృష్టి కోణమే నా చూపులా 


నిజం పిల్లా! నీవల్లే తెలిసింది
మమైకం భావన, ఎలా ఉంటుందో ....
ఆకాశాన్ని చుంబించడం,
ఆకాశం నా చేరువలో ఉండటం
ఎలా మరిచిపోగలను .... ఆ భావనను 
అందువల్ల కలిగిన సంకల్ప బలాన్ని
అంతా నీ ప్రేమవల్లే సాధ్యం అయ్యింది.
జీవితం ఇంత సులభం అయ్యింది
అను క్షణమూ నా మదిలో
నా చేరువలో నా బలానివై ఉన్నందుకు నీవు
నీకు నేను ఋణపడి ఉన్నాను


నీకు తెలుసా?
నేనూ ఎప్పుడూ నీలోనే చూసానని
నా ప్రకాశాన్ని,
నా సామర్ధ్యాన్ని
నా జీవన సరళిలో
నీ ప్రభావానికి నేను
ఎన్ని విధాలుగా .... లోనయ్యానో అని,
అందుకే నీకు ధన్యవాదాలు చెప్పాలనుంది.
నా కోసమే దివి నుంచి
భువికి దిగివచ్చిన వరానివని 
నా జీవన మార్గదర్శనానివీ అని


సమస్యల సునామీ లో


ఎక్కడికి వెళ్ళాలో
ఎవరికోసం ఎదురుచూడాలో
ఎన్ని విధాలుగా
ఏ వైపు చూసినా
అంతా శూన్యమూ నిశ్శబ్దమే

ఏమీ కనిపించవు
నా కోరిక .... చూడాలనుకుంటున్నది
చేతులు చాచి
హృదయపూర్వకంగా
రమ్మని ఆహ్వానిస్తున్న నిన్ను

నీవు నన్ను చేరాలని
నీ స్పర్శను పొందాలని
ఎందుకంటే, నాలో భయం
నన్ను చూసి నేను భయపడుతున్నాను
గాయపరచుకుంటానని నన్ను నేను 


నిన్నూ గాయపరుస్తానని
భయంగా ఉంది
చేర రావా
దూరం చేసేందుకు .... ఈ ఉద్వేగాన్ని
రక్షించేందుకు .... నా నుంచి నన్ను

Saturday, July 25, 2015

ఆకాశం ఉరుముతూ


చూస్తూనే ఉన్నాను పరివర్తనారంభాన్ని
రాత్రివేళ
కాంతిహీనమైన రాత్రి
ఆకాశం గొడుగు కింద కూర్చుని
పాత కథనే ....
కాకపోతే,
కాస్తంత మెలికలు తిరిగి, భిన్నంగా
ప్రాణాంతకం గాలి
వ్యతిరేకత వార్తల నుండి సంరక్షణ
ఫలితం దివ్యంగా ఉండి
జీవితం ఉమ్మదం మయమైనా
ఆడుతూ ఊగుతూ వంగుతూ
చెట్ల కొమ్మలు రాక్షసుల్లా తలలూపుతూ

నియంత్రణను కోల్పోయిన
కోప భావోద్రేకాలు
ఉనికి అంచులో పోరాటం లో
అస్తిత్వాన్ని కోల్పోయినా ....
పోరాడుతూ
ఏ ఆత్మ ఆవిష్కరణ కోసమో .....
ఏ నిబద్ద నిలకడ కోసమో లా
ఆసక్తిలేని ఆ కళ్ళు
చీకటి రోజుల లైంగిక వాంచలా
వికారం గాలి
రక్తప్రసరణ తీవ్రతను పెంచి
గాయపడిన హృదయాలు
అవిరామంగా ఏడుస్తూ ఉన్న
నిరాశా నిస్పృహల
భావనల వెచ్చదనం అది 


పరిశీలించి చూస్తే
అంతర్గత సంఘర్షణల వ్యతిరేకత
ఆవేశం అది.
గాయపడిన హృదయాలనూ ఆక్రమించి 
తీవ్రమైన భయానికి గురిచేసి
నీకూ నాకూ 
ఇబ్బందులు మొదలై
ఆశకు ముగింపు లా
శిధిలావస్థకు చేరుతున్నట్లు
పక్కటెముకల్లో భరించలేని నొప్పి
చెట్టుకు తాళ్ళతో చుట్టబడి 
కట్టెయ్యబడిన సమయం లో
రాళ్ళు విసిరే నిర్వేదం సమాజం లో

Tuesday, July 21, 2015

ఆ నేస్తం నువ్వా!?



నక్షత్రంలా వెలిగి 
ఆకాశం లో 
నేను చూడకపోయినా 
నాకు తెలిసేలా 
నా క్షేమాన్ని ఆశించే 
ఒక సహృదయమై  
నమ్మకం గొడుగై  
తలపై ఉండి
మబ్బులు కమ్మి, 
సమశ్యల మంచుతుఫాను 
కుదిపేసిన వేళల్లో 
అశక్తుడ్నై 
అయోమయాంధకారంలో 
చిక్కుకున్న క్షణాల్లో ....
నన్ను చేరి, 
తన వెలుగుల్ని 
నాపై ప్రసరించి 
మనోబలాన్నిచ్చిన  
ఒక నిష్కల్మష నేస్తం 
ఆ నేస్తం నువ్వేనా!?

Monday, July 20, 2015

ప్రేమించవా నన్ను ఓ పిల్లా


వసంతమే అన్ని వైపులా
హృదయాలను తడుముతూ పొంగిన ప్రేమ
గాలి రాగాలాపన ల్లోనూ, పిల్లగాలి కదలికల్లోనూ 
నా స్వేచ్చా జీవితం లో మాత్రం
ఒక మెరిసిన విధ్యుల్లతను లా
నిన్ను చూడబోతున్న కుతూహలం
నా ప్రతి అణువు కూనిరాగాలు తీస్తూ
ఉత్సాహంగా ఎదురుచూస్తుంది .... ఓ పిల్లా!
నన్ను నీవు అమితంగా ప్రేమించాలి
నీ ప్రేమను నేను బహుమానం
వరం, ప్రసాదం గా పొందాలి అని

ఎటు చూసినా విత్తులు మొలకలౌతూ
ఆ దైవమే పసి ప్రాణిలా ఆవిర్భవిస్తున్నట్లు
పునర్జీవనం, పునఃప్రారంభము
ఉత్సవవాతావరణం కనిపిస్తుంది.
ఓ పిల్లా! నీవు నాతో ఉంటావనే 
సాహచర్యం చేసేందుకు .... నా భావనల
కలల బృందావనం వృద్ధిచేసేందుకు 
నిజం పిల్లా! నేను నిన్ను ప్రేమిస్తున్నాను
దయచేసి నీవూ నన్ను ప్రేమించాలని
కోరుకుంటున్నాను .... ప్రేమించవా నన్ను
నీ ప్రేమను నాకందించవా .... బహుమానంగా 


అందరూ అంటున్నారు నన్నో పిచ్చివాడ్ని అని
రహదారిలో .... ఊహల్లో నడుస్తున్నాను అని
నాకు వారు అర్ధం కారు/
అర్ధం చేసుకునేంత ఓపికా నాకు లేదు
తెలిసిందల్లా నీవు తెలిసి
జీవితంలోకి వచ్చాక చూస్తున్న తియ్యదనమే.
అది ఎప్పటికీ అలాగే ఉంటుంది కదూ! 
నీవూ ఉండి నాతో .... నా కలల బృందావనం లో
మన ప్రేమ పూపరిమళాలను
అందంగా దిద్ది నాతో కలిసి .... ఓ పిల్లా!
ప్రేమిస్తావు కదూ .... పరవశించేలా, ప్రకృతి

Sunday, July 19, 2015

ఆలోచనల్లో


నన్ను నేను కొల్పోయాను.
ఆలోచనల్లో కూరుకుపోయి
భావోద్వేగ సునామీలో
నా అస్తిత్వం
తుడిచేసుకుపోయి
చాన్నాళ్ళే అయ్యింది
పోరాడుతూ
నేను ఓడిపోతూ

అనంత ఆలోచనల సాగరం లో
మునిగిపోయి
అప్పుడప్పుడూ పూర్వాపరాలను
పరిశీలిస్తూ ....
పరిణామం తెలిసీ
బయటపడగలననుకోవడం
అసాధ్యమని తెలిసీ
ఆశల చిగురు కై ఆరాటపడటం
     
నేను, నా జీవితం లో
అన్నీ పోగొట్టుకున్నాను.
అస్వాధించాలి అనుకునే లోపే
ప్రతిదీ కోల్పోయాను.
విధ్వంసక ఆయుధం
నాలో నాకు మిగిలిన
రాగద్వేషమే అయితే
ఎవ్వరైనా ఏం చెయ్యగలరు అని  


అస్తిత్వం కోల్పొయి
ఆలోచనల అడవి .... జీవితం లో
అగమ్యంగా తిరుగుతూ
బయటపడే చిన్న క్లూ కోసం
ఏ దేవుడో ప్రకృతో చెయ్యందించరా
నాకై నేను నిష్క్రమించేలోగా
మన్నించో మందలించో అని
ఆశతో జీవిస్తూ



Saturday, July 18, 2015

బ్రతుకు భారమైన క్షణాల్లో


లేచి నిలబడి కళ్ళు గట్టిగా మూసుకున్నాను.
అన్నివైపుల్నుంచి అలుముకున్న అంధకారం అది.
నా ముందు, నా సమీపం లోనే నిలబడి ఎవరో ....
సహచరుల ఆత్మల్లా ఎవరివో నీడలు
వారి శ్వాస నన్ను తాకుతూ 
కళ్ళు తెరిచేందుకే భయం గా
వారు, సునిశితంగా నా ఆత్మలోకి చూస్తున్న భావన
భయం .... ఏమి చూస్తారో అని
నా నిక్షిప్త అంధకారాన్నా, ఆశలనా
కలలనా, భయాలనా లేక
నేనుగా రూపుదిద్దుకున్న నా అస్తిత్వాన్నా అని,

ధైర్యం చేసి కళ్ళు తెరవాలనిపించి .... తెరిస్తే,
నిజంగానే .... నిలువుటద్దంలో
నా ప్రతిబింబాన్ని నేను చూసుకుంటే ....
నాపై నాకు జాలి వేస్తుందా? లేక భయం వేస్తుందా?
జీవితం నిజంగా అంత అమూల్యమా!?
స్వీయ శతృవునై నాతోనే నేను ప్రతిరోజూ పోరాడుతూ
పోరాడి ఓడి రక్తశిక్తుడ్నై ఇంటికి చేరుతూ 
మరణం గురించే పదే పదే ఆలోచిస్తూ
అది వచ్చేవరకూ ఎదురు చూసే ఓపిక లేక
సాదరంగా స్వాగతించేందుకు సిద్దపడి
బలహీనంగా శ్వాసిస్తూ .... ఎన్నాళ్ళీ బ్రతుకు భారం

Friday, July 17, 2015

ఒకవేళ మరణించాల్సే వస్తే


 మరణించాల్సే వస్తే
వేటాడబడి, గాయపడి
బురద,
మురుగు గుంట
పందిలా కాకుండా
ఆకలీ, పిచ్చి ముదిరి
నాలుగువైపుల నుంచీ
చుట్టుముట్టబడి, శపించబడిన
అరుపుల కుక్కలా
కాకుండా
ఘనముగానే మరణించాలని,
వీలుంటే
ఒక్క రక్తపు బొట్టూ
నేల రాలకుండా
అది భయంతోనే అనుకో
అది భక్తి తోనే అనుకో 
రాక్షసులైనా రాజకీయనాయకులైనా 
గౌరవించి పూజించేలా మరణించాలని, 
చావు
నా సంబంధీకురాలై
నాకూ, చావుకు
ఈ సమాజం ఒక సాధారణ శత్రువై
సంక్యాబలాన్ని మించిన సంకల్ప బలం
ధైర్యం నేనై
వారు కొట్టే వేల దెబ్బలకు
సమాధానం
నా ఒక్క మరణం దెబ్బయ్యేలా
నా పిడికిలే
ఒక విశాలమైన శ్మశానం లా
మారి మరణించాలని
పిరికితనాన్ని ఎదుర్కొలేని
హంతకురాలిలా కాకుండా 
గోడకు నొక్కెయ్యబడి మరణించాల్సొస్తే
పోరాడాలని వీరనారిలా
ఒక పోరాటయోధినిలా

Thursday, July 16, 2015

పిచ్చివాడి దేవతా ....


జతగా ఉండేందుకు ఎవ్వరూ ఇష్టపడనప్పుడు
ఎవ్వరైనా ఏమి చెయ్యగలరు?
ఒంటరి జీవితమైనప్పుడు

ఎన్నాళ్ళు ఈ పరుగులు
ఎన్నాళ్ళు ఈ దాగుడు మూతలు
అంటున్నావు!?


ఆత్మగౌరవం అంటూ
అవివేకంగా నడుచుకుంటున్నానని
అంటున్నావు.

నీకూ తెలుసు

పిల్లా! నీ కోసం
నీ ప్రేమ కోసం, నేను
నీ ముందు మోకరిల్లుతున్నానని  


ప్రాదేయపడుతున్నానని 
దయచేసి నా మది స్థిమితానికి 
కారణానివి కమ్మని

గమనించావో లేదో నన్ను ....
నిన్ను ఆకట్టుకునేందుకు
పడుతున్న ఆరాటం తాపత్రయాల్ని

నీకోసం సంబంధాలు
వెతుకుతున్నారని తెలిసాక మరీ
పిచ్చివాడ్ని లా అయిపోతున్నాను.

నీ ప్రేమలో పడ్డ క్షణం నుంచీ 
నేను నేనులా లేను. నా ప్రపంచాన్ని
తలక్రిందులు చేసుకున్నాను.

చెడు, మంచీ
చీకటి, వెలుగులను విడదీసి చూడు 
మరింత పిచ్చివాడ్ని కాకమునుపే 

దయచేసి చెప్పకు .... మార్గం కనిపించలేదని
వరాన్నీ జీవితాన్నీ ప్రసాదించగల
దేవతామూర్తిని చూస్తున్నాను నీలో

మౌనరాగం


మన ప్రేమకు
ఒక సమున్నత సముచిత
ఉన్నత స్థానం ఇవ్వాలనుంది.
నిశ్శబ్దం లోతుల్లో ....
కొండ చరియల్లో
చెట్ల శాఖలు నిలువుగానూ
వంపులు తిరిగి వ్యాపించి
వాటి నీడలు పైకి
పైపైకి పాకుతున్నంతగా 

మన ఆత్మలు
ఒక్కటిగా కలిసిపోవాలనుంది. 
హృదయమూ, మనసూ 
ఇంద్రియములు
పారవశ్య
నిత్యనూతనత్వ ఏకీభావనల
సమీకరణాలమై 
అస్పష్టసోమరితనం
వ్యసనాలకు దూరంగా

కళ్ళు మూసుకుని
హృదయాన్ని లయబద్దంగా
కొట్టుకోనిస్తూ విశ్రమించాలనుంది. 
నిరర్థక ప్రయత్నాల నుండి
విముక్తులమై
గాడనిద్రలోకి జారి
చేతులు రెండూ
రొమ్ములపై వేసుకుని
ఎప్పటికీ ఫలించని
కోరికల్ని బహిష్కరించుతూ. 


అప్పుడే తెలపాలనుంది. 
సమ్మతి
నీటి వాటంగా కదులుతూ
నీవూ నేనూ
తియ్యదనము, వెచ్చదనము 
ప్రశాంతత .... పిల్ల గాలులై
జోలపాట పాడి
బంగారపు గడ్డి విసెనకర్ర
వింజామరలను పరామర్శిస్తూ   

ఆస్వాదించాలనుంది.
రాత్రి ప్రారంభం కాబోతున్న
సాయంత్రం వేళల్ని
చెట్లు, కొండచరియలు
లోయల అంచులు
నలుపు రంగు పులుముకుని
మన జరిగిపోయిన
పగటి నిరాశ నిస్పృహలను
తన గంభిరమైన గొంతుతో
ఏ రాత్రి కోయిలలానో పాడుతూ

Tuesday, July 14, 2015

వివేకం


నాలుగువైపుల్నుంచీ
కప్పేసి
మూసేసిన
చీకటి ని .... నిన్ను
గమనిస్తూనే
రోషపడి
నీ కళ్ళలోకి
సూటిగా
తీక్షణంగా చూసాను.
నీలానే నేనూనూ
నన్నునూ చూడలేవు
అని నోరు జారి
తెలుసుకున్నాను.
నీవు వివేకివి అని

Saturday, July 11, 2015

పిచ్చి అని తెలిసీ



నా గుండె పిచ్చిదై పోయింది.
ఊపిరాడ్డం లేదు
నీ ద్రోహం సెగ తగిలి
కొట్టుకోవడం మానేసింది

ఐనా,
నా రక్తంతో నీ దాహం తీర్చాలని ఉంది
నీ చెడు కర్మలనుండి
నిన్ను సంరక్షించుకోవాలని ఉంది. 

Thursday, July 9, 2015

నా అమరత్వం నీవే


నా కళ్ళలోకి అలా సూటిగా చూడకు
ఉబికొస్తున్న .... కన్నీళ్ళ ప్రశ్నలను పరచకలా
"నీలో నేను ఏమి చూస్తున్నాను
నాకు ఇంకా ఏమి కావాలి అని అనుమానంగా"
నాకూ నీకూ తెలుసు అప్పుడప్పుడూ
మన ఆలోచనలు ఒక్కటి కావు అని ....
అవి ఒక్కటయ్యేందుకు నీ ప్రయత్నమే ఎక్కువని
అలా నా భారం తగ్గించాలని చూస్తుంటావు.

ఎవరు కన్నారో నన్ను అనాదను ఈ ప్రపంచం
కాదన్నప్పుడు, నాకో సాహచర్యం
అవసరం అయినప్పుడు
నన్ను స్వాగతించి, ఆదరించి ప్రేమించావు.
నేను నా ఆశలన్నీ కోల్పోయినప్పుడు
ఒక్క అడుగూ ముందుకు వెయ్యలేననుకున్నప్పుడు
ముందుకు వచ్చావు నాకు తోడయ్యుండేందుకు
నీ పరిపూర్ణ ప్రేమను పంచేందుకు

ఇన్నాళ్ళూ నీకో నిజం చెప్పలేదు
నా ప్రవర్తన తో నీకు అర్ధమయ్యుంటుందనుకుని
తప్పు చేసాను .... క్షమించు
ఒకవేళ నీకు తెలిసేలా ప్రవర్తించి ఉండకపోతే
నా దృష్టిలో నా జీవితం లో నీ స్థానం ఏమిటో అని
ఓ పిల్లా! ఇప్పుడు చెబుతున్నా విను 
ప్రతి రోజూ ఒక నూతనోదయమే నాకు
నీవున్నావనే ఆలోచన నా పక్కన నా సహచరివై 


"అది చాలదు" అని అనలేవుగా
నేను ముందే విడమర్చుంటే 
నిజం! నీనుంచి నేను అన్నీ పొందాను.
నా హృదయం కోరికలన్నీ పండించుకున్నాను.
సూర్యోదయం, సూర్యాస్తమం నుంచి అర్ధరాత్రి వరకూ
నా జీవితాన్నే కాదు,
నా ఆకలిని, కలలనీ పంచుకున్నావు.
నీవు కలిసాక అన్నీ పొందిన
పరిపూర్ణుడనే భావన నాలో .... ఇప్పుడు

Wednesday, July 8, 2015

అది నువ్వే


బంకజిగురులా పేరుకుపోయిన 
వదలని ఆలోచనలతో
నీ యొక్క సుకుమార
వ్యక్తిత్వ సువాసనలను
వెదజల్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు,
ఒక పునః సంభవ కలలో లా
నీ జ్ఞాపకాల నీడలు వెంటాడుతూ
ఆ నీడలను చూసి ఉలిక్కిపడి
కొట్టుమిట్టాడుతూ
ఏదో స్వరం .... గదిలో
ప్రతిధ్వనై అన్ని వైపుల నుంచి
నీవే లా .... నీ సవ్వడి లా

Monday, July 6, 2015

నీవు అనుభూతి చెందడం కోసం


కన్నీటిలో నీవు తడుస్తూ
వర్షపు చినుకులు సూదుల్లా నీ ముఖాన్ని
గుచ్చుతున్నప్పుడు
ప్రపంచానికి నీవేమీ కావనుకున్నప్పుడు
ఒక వెచ్చని నమ్మకాన్ని కావాలని 
చేరదీసుకుని నిన్ను .... నా హృది లోకి
నీవు గుర్తెరిగేలా, నీ పట్ల ప్రేమను ....

సాయంత్రపు నీడలు పరుచుకుపోతూ
తారలు కనిపించే వేళ
ఎవ్వరూ నీ సరసన లేరనిపించినప్పుడు
నిన్ను దగ్గరకు తీసుకునేందుకు
నీ కళ్ళు తుడిచేందుకు
ఒక తోడై ఉండి, నిన్ను ఓదార్చేందుకు
ఎన్నో జన్మల లక్షల సంవత్సరాల ప్రేమను లా

నా మనసుకు తెలుసు .... అంత సులభం కాదని
అంత తొందరగా నీవు ఒక నిర్ణయానికి రాలేవని
పరిపూర్ణంగా నమ్మలేని స్థితిలో ఉన్నావని
అందుకే మాటిస్తున్నాను.
నావల్ల ఎలాంటి తప్పిదమూ జరగదని
నిజానికి నిన్నెరిగిన క్షణం నుంచే చెబుతూ ఉన్నాను ....
నా మదికి, నీ స్థానం నాహృదయం లో నేనని

ఎప్పుడైనా మనిషిలో ఏ పిచ్చి కొరైకలైనా కలగొచ్చు
మోహపుటాలోచనలేవైనా కమ్మెయ్యొచ్చు
మూలములల్లోంచి అతనిలో వికారం పెరగొచ్చు
అన్నింటినీ ఎదుర్కునేందుకు సిద్దంగానే ఉన్నాను,
అవసరమైతే .... వీది వీదంతా ప్రాకాల్సొచ్చినా
ఎంత కష్టపడాల్సొచ్చినా. స్వేదించాల్సొచ్చినా .... నీ కోసం
చెయ్యగలిగిన అన్నీ చేస్తా, నా ప్రేమను నీవు గుర్తించేలా 


ఈదురు గాలుల వీస్తూ శరీరం గడ్డకట్టి
సుడులు తిరిగే సముద్ర ఆవేశం తుఫానులాంటి
పరిహారం, పచ్చాత్తాపం అవసరం లేని
ఏ ఉదృత స్వేచ్చా గాలుల ఆలోచనల
రహదారిలో .... మార్పు ను
గమనించి, ఊహించి, చూసి ఉండని విధంగా
నన్ను నేను దిద్దుకుని, కూర్చుకుని నీ ఆసరాగా

నీ కోసం నేను చెయ్యలేనిదంటూ ఉంటుందనుకోను.
ఈ భూమి అంచు వరకూ వెళ్ళొస్తాను
నీ ఆనందం కోసం, నీ కలలు వాస్తవం చెయ్యడం కోసం
ముఖ్యం గా నా ప్రేమ, నీకు అర్ధం కావడం కోసం

Friday, July 3, 2015

బొట్లు బొట్లుగా రక్తం ....


ఎప్పటిలానే మరో రాత్తిరి
కేవలం ఒక సాధారణ సంగ్రహావలోకనం కారణం గానే
నేను పారిపోవాలనుకుంది .... దూరంగా
దాక్కునే ప్రయత్నంలో .... నా ఆలోచనల నీడలో

కానీ ఇప్పటికీ నీవు ఇక్కడ నా పక్కనే ఉన్నావు
కేవలం తొలి రోజున లా తలొంచుకుని
నేను వెదుక్కునేలా .... నిజాయితీ నిజంగా ఉందా
నా రోజువారీ ఆకలి ఆహారంలో అని  

స్వతహాగానే నేను .... ఒక స్వయం బానిసను
స్వీయ విధ్వంసకుడ్ని .... మేక చర్మం ధరించిన పులిని
అనుషంగిక సమ్మోహన అనుభూతి ఆరాటం లో
తెగించిన ఒక మానసిక మోసగాడ్ని

నేను బ్రతుకుతుంది కేవలం .... నా శ్వాస కోసం
కేవలం నేను కన్న కలలు తీర్చుకోవడానికోసం  
అంతే కాదు పొంచిచూస్తుంది కూడా వేటాడడం కోసం 
కేవలం రాక్షసానందం అనుభూతి చెందడం కోసం

జీవితం


ఈ జీవన యానం లో 
ఎన్ని మైలురాళ్ళో
అనుభూతుల్లా 

జీవించి. 
ప్రేమించి, పొంది, 
నమ్మి, కోల్పోయి

గాయాలు, ఎదురుదెబ్బలు 
పొరపాట్ల తప్పిదాలు .... 
దశలను దాటి 

ఆ పరిణామ క్రమం లో 
పొందిన విజ్ఞత, వివేకమే 
జీవితం అని తెలుసుకుని

Thursday, July 2, 2015

నిన్నే చూస్తున్నా


ఎవరో ఆ అదృష్టవంతుడు
ఉండే ఉంటాడు ఎక్కడో
ఏ సుదూర తీరాలకో తీసుకుపోయేందుకు
నిన్ను
ఎవరి కలలు, ఊహలు కనుగొనని చోటుకు

నీకైనా తెలుసా
ఎవ్వరికీ తెలియదనుకుంటున్నాను
నీ స్వచ్చ నిర్మల ప్రేమకు
పాతృడు ఎవరో
నిన్ను పొందే ఆ అదృష్టవంతుడు ఎవరో

దాయలేని విశాల చక్షువులు
నీ కళ్ళలో చూడగలుగుతున్నాను.
వింత భావాన్ని
అందమైన నమ్మకాన్ని
ఆ ఎవ్వరో నేనే కావచ్చని

ఎవరు అందుకుంటారో
నీ సున్నిత సుకుమార హస్తాన్ని
అంచలాగ్రాన్ని
ఆ అమూల్యమైన బహుమానాన్ని
నీ హృదయాన్ని

ఎవరు చెప్పగలరు
రేపు ఏమి జరుగుతుందో
ఎక్కడ నీవు స్థిరపడతావో
ఏ దూరతీరాల్లో ఉన్న
ఏ అపరిచితుని సహచరివౌతావో

ఎవరికీ తెలియదు
ఏ మలుపు తిరుగుతుందో నీ జీవితం
నేను మాత్రం చూస్తున్నాను .... ఆశగా
నీ కళ్ళలో .... నా పట్ల పెరిగిన
ఆ స్వచ్చ నిర్మల ప్రేమ భావనలనే